ఏపీలో సరిగ్గా ఆరు నెలల కిందట అంటే నవంబర్ నెల పదకొండో తారీఖున 2017లో కృష్ణా నదిలో భవానీ ద్వీపం నుండి విహారయాత్రకు ముప్పై ఎనిమిది ప్రయాణికులతో బయలుదేరిన పడవ మునిగి పదహారు మంది మరణించిన సంఘటన తెల్సిందే .
అయితే అంతటి ఘోర విషాదం జరిగిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది .ఈ క్రమంలో పాపికొండలు యాత్రలో మొత్తం ఎనబై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న బోటులో బయలుదేరిన కాసేపటికే నిప్పులు చెలరేగడంతో పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది .
దీంతో ఒక్కసారిగా పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు .అయితే బోటు పాతది కావడం వలనే ఇంజన్ హీట్ ఎక్కి ప్రమాదం జరిగినట్లు సమాచారం .అయితే కృష్ణా నదిలో జరిగిన ఘోరం తర్వాత గుణ పాఠం నేర్చుకోకపోవడం వలనే తరుచు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని ప్రయాణికులు అంటున్నారు ..