వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 13 న పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించబోతోంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లా వైసీపీ నేతలు ఆళ్లనాని, తలశిల రఘురాం, కోటగిరి శ్రీధర్‌లు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని తెలిపారు. 14వ తేదీన ఏలూరు సమీపంలోని మదేపల్లి వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా 40 అడుగుల పైలాన్‌ను జగన్ ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా ఏలూరు పాత బస్టాండ్(14 వతేది)లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. మరో వైపు జిల్లాలోని టీడీపీ నేతలంతా అవినీతి ఆరోపణలలో కూరుకుపోయారని నేతలు విమర్శించారు.