ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు .గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో సైకిల్ యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు విజయ్ పాల్గొన్నారు .అయితే విజయ్ సైకిల్ యాత్ర చేయకుండా బైక్ ర్యాలీ నిర్వహించమని ఆదేశాలను జారీచేశాడు .ఈ నేపథ్యంలో గ్రామం సమీపంలోని మలుపు వద్ద టర్న్ చేస్తుండగా అదుపు తప్పడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు .అంతే ఆ వెనకే ఉన్న ఇంకో బైక్ విజయ్ బైక్ మీద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి .దీంతో ఆయన ఎడమ చేతికి తీవ్ర గాయమవ్వడంతో విశాఖపట్టాణానికి తరలించారు ..