తెలంగాణరాష్ట్రం లో రైతు పాస్ పుస్తకాలు,పెట్టుబడుల పంపిణీ దేశ రైతాంగం చరిత్రలో నూతన శకానికి నాంది పలికిందని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ని చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో రైతుబంధు పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఎంఎల్ఏ యాదయ్య, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, కలెక్టర్ రఘునందన్ రావు తదితరులతో కలిసి మాట్లాడుతూ రైతుబంధు పథకం చెక్కులను తీసుకున్న రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందన్నారు.
ఉమ్మడి రాష్ట్రం లో పాలకులు రైతాంగాన్ని పట్టించుకోకుండా పోవటంతో రైతులు అప్పుల పాలై ఆత్మ హత్యలు చేసుకున్నారన్నారు. ఆత్మహత్యలు లేని సుభిక్షమైన రైతాంగం గల తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు.గత పాలకుల హయాంలో వ్యవసాయం దండుగ అనే స్థాయి నుండి పండుగలా చేసేందుకు సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడులు అందిస్తున్నారు.రాష్ట్రం లో 58.33 లక్షల మంది రైతాంగానికి రూ. 12 కోట్ల పెట్టుబడులు అందిస్తున్నం.
ఉమ్మడి జిల్లా లో 5,04,478 మంది రైతులకు పాస్ పుస్తకాలతో పాటు 553 కోట్ల 88 లక్షల పెట్టుబడులు అందిస్తున్నం.రంగారెడ్డి జిల్లాలో 25 మండలాల్లో 2,87,073 మందికి రూ. 283 కోట్ల పెట్టుబడులు పంపిణీ చేస్తున్నం.రైతులకు కోట్లాది నిధులతో వ్యవసాయ యంత్రాలు, అంతరాయం లేకుండా 24/7 విద్యుత్ సరఫరా, మద్దతు ధరలు అందించి రాష్ట్ర రైతాంగం ను ధనికుల ను చేస్తామని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు ..