వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఇప్పటికే ఎంతోమంది పేదలకు ఆర్ధిక సాయాన్ని అందించి తన గొప్ప మనస్సును చాటుకోగా..తాజాగా నియోజకవర్గంలో రైతు బంధు చెక్కులను పంపిణీ చేయడానికి వెళ్ళుతుండగా పంథిని గ్రామంలో ముగ్గురు అడపిల్లల తండ్రి నస్కూరు కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్నఎమ్మెల్యే అరూరి రమేష్ తన కారును ఆపి ఆ కుటుంబాన్ని పరామర్శించి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తన గొప్ప మనస్సు ను చాటుకున్నారు.ఇంత బిజీ షెడ్యుల్ లో కూడా ఎమ్మెల్యే వారి కుటుంబాన్ని పరామర్శించడంతో ఎమ్మెల్యే అరూరిది గొప్ప మనస్సు అంటూ..కష్టం వస్తే ఎంతటివారినైనా వెంటనే ఆదుకుంటాడు అని స్థానికులు కొనియాడారు