Home / NATIONAL / 25 మంది అమ్మాయిల బ్రా తొలగిస్తే ..అక్కడ ప్రశ్నాపత్రం అడ్డుపెట్టుకోని పరిక్ష

25 మంది అమ్మాయిల బ్రా తొలగిస్తే ..అక్కడ ప్రశ్నాపత్రం అడ్డుపెట్టుకోని పరిక్ష

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) చరిత్రలో ఎన్నడూ లేనంత కళంకానికి గురైంది. దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ అర్హత పరీక్ష సందర్భంగా డ్రెస్ కోడ్ పై పెట్టిన ఆంక్షలపై అధికారుల అహంకారపూరిత వైఖరి వల్ల పరీక్షకు హాజరైన విద్యార్థినులు ఘోరమైన అవమానాలను ఎదుర్కొన్నారు. విద్యార్థినులు బ్రాలు ధరించివస్తే పరీక్షకు కూర్చోనివ్వలేదు. వేసుకున్న జీన్స్‌దుస్తులకు మెటల్ బటన్స్ ఉండటాన్ని కూడా అధికారులు ఒప్పుకోలేదు. పొడవు చేతులు చొక్కాలు విప్పలంటూ వేధింపులకు గురిచేశారు.అయితే ఈ ఉదంతంపై తనను వేధింపులకు గురిచేశారంటూ 18 ఏళ్ల ఓ విద్యార్ధిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం… పరీక్షలకు ముందు ఆమెను తనిఖీ చేసిన ఇన్విజిలేటర్లు బ్రా తొలగించాలని ఆదేశించారు. దానికి స్టీల్ హుక్స్ ఉన్నాయనీ.. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం పరీక్ష హాల్లోకి మెటల్ వస్తువులను అంగీకరించబోమని చెప్పారు. కేరళలోని పలక్కాడ్ జిల్లా కొప్పాం లయన్స్ స్కూల్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

పరీక్షా కేంద్రం సిబ్బంది నిర్వాకంతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యాననీ.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు పేర్కొంది. పరీక్ష రాస్తున్నంత సేపూ మగ ఇన్విజిలేటర్ ఒకరు తన వైపు పదే పదే చూడడం అవమానంగా అనిపించిందని ఆమె వాపోయింది. కాగా దాదాపు 25 మంది విద్యార్ధినులను బ్రా తొలగించాలంటూ ఇబ్బంది పెట్టారని బాధితురాలి బంధువు ఒకరు ఆరోపించారు. ‘‘మగ ఇన్విజిలేటర్ వెర్రి చూపుల నుంచి కాపాడుకునేందుకు వారు తమ ఛాతీకి ప్రశ్నాపత్రం అడ్డుపెట్టుకోవాల్సి వచ్చింది..’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కేవలం ఆ ఒక్క పరీక్షా కేంద్రంలోనే ఇలా ఇబ్బంది పెట్టారనీ… మిగతా చోట్ల ఇలాంటి పరిస్థితి లేదని తన మిత్రులు చెప్పినట్టు సదరు విద్యార్ధిని పేర్కొంది.

మరోవైపు సీబీఎస్ఈ నిబంధనల మేరకే సిబ్బంది నడుచుకున్నందున తాము ఈ ఫిర్యాదును స్వీకరించలేమని పోలీసులు చేతులెత్తేశారు. అయితే బాధితురాలి పట్ల అనుచితంగా వ్యవహరించిన మగ ఇన్విజిలేటర్‌పై ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ… ‘‘పరీక్ష జరిగిన స్కూల్‌కి వెళ్లి విచారణ జరిపాం. పరీక్షా కేంద్రంలో అందరూ మహిళా ఇన్విజిలేటర్లే ఉన్నారనీ, ఒక్క వ్యక్తి మాత్రం సీబీఎస్ఈ నుంచి అదనపు పరిశీలకుడిగా వచ్చారని యాజమాన్యం పేర్కొంది. దీంతో అతడిపై కేసు నమోదు చేశాం. అతడి గుర్తింపును పరీశీలించేందుకు త్వరలోనే సీబీఎస్‌ఈని సంప్రదిస్తాం…’’ అని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat