తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు అని మంత్రి ఈట ల రాజేందర్ అన్నారు.సీఎం కేసీఆర్ ఇవాళ రైతు బంధు కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు.రైతు బంధు పథకం దేశానికే ఆదర్శమని అన్నారు.రైతు బాగుపడితే..రాష్ట్రం బాగుపడుతుందన్నారు.ఒక్కరుపా యి ఖర్చు లేకుండా 12వేల కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా రైతులకు అందిస్తున్నారని తెలిపారు. అది కూడా కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించడం తమ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు మంత్రి ఈటల.
