తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పరిపాలన అందిస్తుంది అని….ప్రజలే ప్రభుత్వం పథకాల పై పాఠాలు చెప్తున్నారు అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు…రాష్ట్రంలో సిద్ధిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రాజేందర్ అతని అనుచరులతో కలసి మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాస పార్టీలో చేరారు…
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ప్రజల మేలు కోసము… ప్రభుత్వం చేసే ప్రతి పనీ ప్రజా సంక్షేమం కొరకే అని…తెరాస ప్రభుత్వానికి ప్రజలే బాస్ లు అని…ప్రభుత్వ పథకాల ప్రచారకర్తలు వారే అని అన్నారు…తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రయోజనాల కొరకే అని….ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలే చెపుతారు..అంటే ప్రభుత్వం చేసిన ప్రతి పనీ…ప్రజలకు అర్థమయ్యేలా చేసామని…సంక్షేమ ఫలాలు అందించడం లో ప్రభుత్వం సఫలీకృతం అయిందన్నారు..
రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలపై ప్రజలే పాఠాలు చెప్తారు అని…ప్రతిపక్షాలకు ఆ పాఠాలే గుణపాఠాలు అవుతాయన్నారు…సిద్దిపేట అభివృద్ధి రాష్ట్రానికె ఆదర్శం అని.. అన్ని నియోజకవర్గాలు సిద్దిపేట అభివృద్ధి వైపు చూస్తానయని… ప్రభుత్వ చేసే అభివృద్ధి కార్యక్రమాలు… సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకందిచడం లో యువకులు వారధుల్లా పని చేసి ప్రజలకు చేరవేయడంలో ముందుండలన్నారు..గ్రామంలో దాదాపు 150మంది యువకులు మంత్రి సమక్షంలో తెరాస పార్టీలో చేరారు….