పని చేసే యజమాని పెళ్లికి వస్తేనే ఎంతో సంబరం ఆ ఇంట్లో.. అభిమానించే నటుడో.. హీరోనో వస్తేనే ఎగిరి గంతేస్తాం.. అలాంటిది పిలుపు లేకపోయినా.. కలలో కూడా ఊహించని విధంగా సామాన్యుడి ఇంట్లో పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరు అయితే ఎలా ఉంటుంది.. ఆ పెళ్లి మొత్తం హడావిడి, హంగామానే కాదు ఆశ్చర్యం, షాక్ అవుతారు. అలాంటి షాక్ ను ఓ పెళ్లిలో చూపించారు సీఎం కేసీఆర్.
గురువారం (మే-10) రైతుబంధు పథకాన్ని ప్రారంభించేందుకు కరీంనగర్ -హుజురాబాద్ రోడ్డులో వెళుతున్నారు. ఫుల్ సెక్యూరిటీ, కాన్వాయ్ ఉంది. తాడికల్ గ్రామంలో రోడ్డు పక్కనే ఓ పెళ్లి జరుగుతుంది. తోరణాలు, టెకరేషన్ కేసీఆర్ కంట్లో పడ్డాయి. వెంటనే తన కాన్వాయ్ ఆపారు. బస్సు దిగారు. సీఎం సడన్ గా బస్సు దిగటంతో భద్రతా సిబ్బంది అంతా అయోమయానికి గురయ్యారు.బస్సు దిగిన కేసీఆర్ నేరుగా పెళ్లి మండటంలోకి వెళ్లిపోయారు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా క్యూకట్టారు.
కొత్త దంపతులు కావ్య, మనోహర్ ఆనందానికి అవధులు లేవు. సీఎం కేసీఆర్ మా పెళ్లికి రావటం ఏంటీ అంటీ అని అక్కడ ఉన్న వాళ్లందరూ తమకు తాము ఓ సారి గిల్లి చూసుకున్నారు. కలా.. నిజమా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కొత్త దంపతులను ఆశీర్వదించింది కేసీఆర్.. కల్యాణ్ లక్ష్మీ పథకం కింద ఆర్థిక సాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఏది ఏమైనా తమ జన్మ ధన్యం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొత్త దంపతులు.