ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఫాలో అవుతున్నారా ..ఇటివల ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తామని ..ఆవిధంగా ముందుకెళ్ళి మరి కొట్లాడి ప్రత్యేక హోదాను తీసుకొస్తామని బహిరంగంగానే ప్రకటించారు కూడా .
తాజాగా పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా కైకలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్నట్లుగా ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరిగా తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఆయన అన్నారు ..అంతే కాకుండా తెలంగాణలో ప్రభుత్వమే గురుకులాలు ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఈ స్కూళ్ళను ప్రవేశపెడ్తామని ..ఉన్నవాటిని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ..
అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్న పథకాలను ఏపీలో అమలు చేస్తామని హామీ ఇస్తే వైసీపీ గెలుపును ఎవరు అడ్డుకోలేరని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు .ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీ అయిన బీజేపీ తమ మ్యానిపెస్ట్ లో టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పథకాల పేర్లను మార్చి హామీల వర్షం కురిపించిన సంగతి విదితమే ..దీంతో మొదటిలో కాంగ్రెస్ పార్టీ గాలీ వీచిన కానీ ఈ హామీల వర్షం కురిపించడంతో ఒక్కసారిగా గాలి బీజేపీ వైపు మళ్ళింది ..