Home / ANDHRAPRADESH / వైఎస్ జగన్ కు ఓ చిన్నారి లేఖ..అందులో ఏముందో తెలుసా..!

వైఎస్ జగన్ కు ఓ చిన్నారి లేఖ..అందులో ఏముందో తెలుసా..!

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. నవరత్నాల హామిలను జనాల్లోకి తీసుకెళ్తూ సాగిపోతున్నారు జగన్. ఈ నేపథ్యంలో మంగళవారం గుడివాడ నియోజక వర్గంలోని చినపాలమర్రులో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఐదో తరగతి చదువుతున్న ఓ చిన్నారి జగన్ కు ఓ లేఖ ఇచ్చింది.

లేఖలో ఏముంది అంటే ..
స్వాగతం సుస్వాగతం జగనన్నకి. మీ అమ్మ ఒడి పథకం చాలా బాగుంది. మా ఇల్లు పూరిల్లు. పూరిల్లుని డాబాలు చేయమని కోరుకుంటున్నాం. 2000 ఫించన్‌ వృద్దులకు ఇవ్వడం మంచిది. రాష్ట్రంలో అత్యాచారాలు బాగా పెరిగిపోయినాయి. ఆడపిల్లల్ని పెద్దన్నలాగా కాపాడుతావని కోరుకుంటున్నాం.. అని ఆ చిన్నారి లేఖలో రాసింది. ఆ చిన్నారి రాసిన లేఖను జగన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇవాల్టి పాదయాత్రలో 5వ తరగతి చదువుతున్న ఓ చిట్టితల్లి తాను రాసిన ఈ చిట్టీని చేతికిచ్చింది.’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కాగా, నవరత్నాల్లో భాగంగా వైసీపీ ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రతీ తల్లికి ఏటా నేరుగా రూ.15000 అందిస్తారు. రాష్ట్రంలో ప్రతీ బిడ్డకు విద్య అందాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. వారి చదువు పూర్తయ్యేంతవరకు మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్ జగన్ అన్నారు.

ఇవాల్టి పాదయాత్రలో 5వ తరగతి చదువుతున్న ఓ చిట్టితల్లి తాను రాసిన ఈ చిట్టీని చేతికిచ్చింది.#PrajaSankalpaYatra #YSRKutumbam

Posted by YS Jagan Mohan Reddy on Tuesday, 8 May 2018

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat