Home / SLIDER / అర్జున్ రెడ్డి బ‌ర్త్‌డే..హైదరాబాద్ న‌గ‌ర‌వాసుల‌కి ఐస్‌క్రీమ్స్ ఫ్రీ

అర్జున్ రెడ్డి బ‌ర్త్‌డే..హైదరాబాద్ న‌గ‌ర‌వాసుల‌కి ఐస్‌క్రీమ్స్ ఫ్రీ

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నేడు.ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న ఆలోచ‌న చేశాడు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో ఎండ‌లకి అల‌మ‌టిస్తున్న వారికి ఐస్‌క్రీమ్స్ అందించి వారిని కూల్ చేసేందుకు బ‌ర్త్‌డే ట్ర‌క్‌ల‌ని ఏర్పాటు చేశాడు.. ఈ సందర్భంగా ఆ ట్రాక్ ఫోటోలను తన ట్విట్ట‌ర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు.

స‌మ్మ‌ర్‌లో కొన్ని రోజులు షూటింగ్ చేసిన త‌ర్వాత చ‌ల్ల‌ని ఐస్‌క్రీమ్స్ అందించాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. మూడు ఐస్‌క్రీమ్ ట్ర‌క్కుల‌ని తీసుకున్నాను. ఇవి హైద‌రాబాద్ సిటీ అంతా తిరుగుతూ ఎండ‌ల‌లో వ‌ర్క్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు, చిరు వ్యాపారులు, విద్యార్ధులు, ఉద్యోగులు ఇలా ప‌లువుర‌కి ఉచితంగా ఐస్‌క్రీమ్స్ అందిస్తాయి. . మీకు ఎక్కడైనా నా బర్త్‌డే ట్రక్ కనిపిస్తే ఏం సిగ్గుపడకుండా ఐస్‌క్రీమ్ తీసుకోండి. హాయిగా ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను నాకు షేర్ చేయండి. మీకు ముఖాల్లో ఆనందాన్ని చూస్తే నేను హ్యాపీగా ఫీలవుతానంటూ’ హీరో విజయ్ వరుసగా ట్వీట్ చేశారు.అయితే విజయ్ తన పుట్టిన రోజున చేస్తున్న ఈ పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఈ సందర్భంగా త‌నకి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తున్నారు.

A few days of shooting in the Sun made me think of this.What if I got 3 ice cream trucks to drive around the city and…

Posted by Vijay Deverakonda on Tuesday, 8 May 2018

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat