సినిమా పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం మొదలు పెట్టిన శ్రీరెడ్డి తన పోరాటాన్ని మరింత విస్తరిస్తోంది. కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు, ఏ రంగంలో అయినా సరే ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తాజా పోస్టు చూస్తే తెలుస్తోంది. ఒక ఆడ పిల్ల సమాజంలో ఎన్ని రకాలుగా వేధింపులు ఎదుర్కొంటోందో తన పోస్టులో చెప్పే ప్రయత్నం చేశారు శ్రీరెడ్డి. సెక్స్ అంటే ఏమిటో తెలియని వయసు నుండే వారికి వేధింపులు మొదలవుతున్నాయని ఆమె వెల్లడించారు.
తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. చిన్నతనం నుంచే తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ఆ పోస్టులో ప్రస్తావించింది. భయం రెండో వైపు..అంటూ చిన్నతనంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తూ.. ఏదో ఏ రోజు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో బతుకుతున్నానని తెలిపింది. తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడు తనను అతను తాకాడు. పదో తరగతి వరకూ అదే జరిగింది. అప్పుడు తెలియలేదు. ప్రస్తుతం తెలిసినా ఏం చేయాలో తెలియదు. ఏడవ తరగతి అమ్మాయిని చూసి 30 ఏళ్ల వాడికి మూడ్ వస్తే దాన్ని ఏమనాలి? తాను పుట్టినప్పుడు తనను ఎత్తుకున్న చేతులే తనను ఆకాంక్షిస్తే.. ఏం చేయాలి.. ఎలా పోరాడాలంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఇలా లక్షల కోట్ల మంది ఉన్నారు. బస్సుల్లో, సినిమా థియేటర్‌లో, జాతరలో అన్నీ ప్రాంతాల్లో ఇదే జరుగుతోంది. అయినా ఏమీ పీకలేని పిరికివాళ్లమని శ్రీరెడ్డి తెలిపింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
A girl's insecurity in words, there is no security to the girl at home also..please let them live happily..stop sexual harrasments..#metoo
Posted by Sri Reddy on Thursday, 3 May 2018