దేశ వ్యవసాయ రంగ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వం ఓ నూతన అధ్యాయానికి రేపు శ్రీకారం చుట్టబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న రైతు బంధు పథకం అమలుకు కరీంనగర్ జిల్లా ధర్మరాజుపల్లి గ్రామం చరిత్రాత్మక వేదికగా నిలువబోతున్నది. తెలంగాణ రైతాంగం కళ్లలో వెలుగును, జీవితాల్లో భరోసాను, కొండంత ధైర్యాన్ని నింపే ఈ పథకం సాయం కోసం రాష్ట్ర రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈ సందర్భంగా రైతుబందు చెక్కులకు సంభంధించి కొన్ని ముఖ్య సూచనలు:
√ మన గ్రామానికి చెందిన వీఆర్ఏ దగ్గర చెక్కులు వచ్చిన వాళ్లందరికీ సంబంధించిన స్లిప్పులు ఉంటాయి
√ ఆ స్లిప్పుల మీద మీ పట్టాదారు క్రమ సంఖ్య నెంబరు ఉంటుంది
√ పంపిణీకి రెండు రోజుల ముందు తప్పనిసరిగా వీఆర్ఏ దగ్గర స్లిప్పు తీసుకోవాలి
√ చెక్కుల పంపిణీ రూమ్ లోకి ప్రవేశానికి మరియు మన పాస్ బుక్కు ఏ కౌంటర్లో ఉందో గుర్తించడానికి ఆ స్లిప్పు ఉపయోగపడుతుంది
చెక్కుల పంపిణీ సమయంలో:-
√ మన గ్రామంలో పంపిణీ సమయంలో ఏర్పాటుచేసిన కౌంటర్లలో మన చెక్కు ఏ కౌంటర్లలో ఉందో స్లిప్పు మీద ఉన్న నంబరు ను బట్టి గుర్తించాలి.
√ ఏ కౌంటర్లలో ఏ నెంబరు గల పాసుబుక్కులు ఉన్నాయని బయట డిస్ప్లే చేస్తారు.
√ ఆధార్ కార్డు ఒరిజినల్ మరియు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
√ పట్టాదారు మాత్రమే చెక్కును తీసుకోవడానికి రావాలి. వారికి బదులు వారి బంధువులకు ఎట్టి పరిస్థితిలో ఇవ్వరు. పట్టాదారు అనారోగ్యంగా ఉన్నచో అధికారులు ఇంటికి వెళ్లి చెక్కును అందజేస్తారు.
√ సంబంధిత అధికారులు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించిన తర్వాత చెక్కు పాస్ బుక్కు అందజేస్తారు.
√ ఆధార్ కార్డు నెంబరు ఇవ్వని వారికి ఫోటో సరిగా దిగని వారికి పాస్బుక్కులు రాకుండా కేవలం చెక్కులు మాత్రమే వచ్చాయి.
√ అట్టి రైతులు చెక్కు తీసుకొని ఆధార్ కార్డు జిరాక్స్ అధికారులకు ఇవ్వాలి. త్వరలో అట్టి రైతులకు పాస్బుక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది.
√ బయటకు వచ్చిన తర్వాత సర్వే నెంబర్లు అమౌంటు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
√ భూమి వివరాలు సరిగ్గా పడకపోయినా, చెక్ మీద అమౌంటు తక్కువగా వచ్చిన అని గుర్తిస్తే ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లలో గ్రీవెన్స్ farms దొరుకుతాయి.
√ ఆ గ్రీవెన్స్ farms పై మీకు సంబంధించిన వివరాలు మీ ఫిర్యాదు రాసి అధికారులకు వెంటనే అందజేయాలి.
√ చెక్కుల సమయంలో ఆధార్ కార్డు అందుబాటులో లేనివారు మీకు సంబంధించిన ఏ గుర్తింపు కార్డు నైనా చూపగలరు.
√ పట్టణం నుండి అదేరోజు చెక్కులు తీసుకోవడానికి వచ్చిన రైతులు మొదట తీసుకోవాల్సిన స్లిప్పులు, వీఆర్ఏ అందుబాటులో లేనట్లయితే …….పంపిణీ సమయంలో అక్కడే ఉన్న సూపర్వైజర్ ఆఫీసర్ నీ సంప్రదించాలి.
√ అనివార్య కారణాలవల్ల చెక్కులు పాస్బుక్కులు తీసుకోని రైతులు MAY 21st నుండి వారం రోజులపాటు తహసిల్దార్ వారి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలనుండి 5 గంటల మధ్య సంప్రదించాలి.
√ కేవలం పాసుబుక్ ను మాత్రమే తీసుకుని స్వచ్ఛందంగా చెక్కును వదులుకుంటున్న రైతులు ప్రత్యేక కౌంటర్లో ఏర్పాటు చేసిన give it ఫామ్ మీద సంతకం చేసి ఇవ్వాలి.
చెక్కుల పంపిణీ తర్వాత :-
√ మనకు వచ్చిన చెక్కు అదే బ్యాంకుకు సంబంధించి తెలంగాణలో ఏ బ్రాంచి నుండయినా నగదు పొందవచ్చు.
√ చెక్కును నగదుగా మార్చుకునే సమయంలో బ్యాంకు సిబ్బందికి మీ ఒరిజినల్ passbook, ఆధార్ కార్డు (any ఐడెంటి కార్డు) చూపించాల్సి ఉంటుంది.
√ చెక్కును నగదుగా కాకుండా తమకు సంబంధించిన అకౌంట్లలో జమ చేసుకోవాలని ఆసక్తి కలవారు అకౌంట్ బుక్కు కూడా బ్యాంకు కి తీసుకొని వెళ్ళగలరు