ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యల కోరకు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర భారీగా విజయం సాధించింది. ఈ పాదయాత్రతో టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా వలసలు పెరిగినాయి. అంతేగాక రోజు రోజుకు వైసీపీ పార్టీ బలం ఆంధ్రప్రదేశ్ లో అంతకు అంత పెరుగుతుంది. ఇక జిల్లాల వారిగా చూస్తే…ఆయా జిల్లాలో సీనీయర్ నేతలు నియెజక వర్గాల వారిగా ఎన్నికల హాడవీడి మొదలు పెట్టినారు. వైసీపీ పార్టీ కార్యకర్తలు కష్టించి పనిచేస్తే ..అప్పుడే పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని, నాయకులకు మంచిరోజులు వస్తాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచిస్తున్నారు.
ఇకపోతే కర్నూల్ జిల్లాలో కాటసాని రాంభూపాల్ రెడ్డి రాకతో వైసీపీ పార్టీ బలోపేతం అయిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, అలాంటి వ్యక్తికి తన వంతు సహకారం అందించాలనే కాటసాని పార్టీలో చేరారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమనీ, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పాణ్యం నుంచి పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆ విషయం పార్టీ అధినేత చేతుల్లో ఉందన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాటసాని మంగళవారం నియమితులయిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ నుంచి ఎప్రిల్ 29న వైసీపీలోకి చేరారు. గతంలో పాణ్యం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వీరి మాటలతో ఏపీలో ఉన్నమొత్తం వైసీపీ అభిమానులకు మరింత ఊపు వస్తుంది.