ఇటివల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్ అండ్రూ టై నాలుగు ఓవర్లు వేసి మొత్తం ముప్పై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లను పడగొట్టి రాజస్థాన్ రాయల్స్ టీం భారీ స్కోరు సాధించకుండా అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు టై .అయితే ఇందులో షేర్ చేసేది ఏముందని ఆలోచిస్తున్నారా ..
అయితే ఆ విషయానికి వస్తున్నాం ..అసలు విషయం ఏమిటి మ్యాచ్ అవ్వగానే టై మాట్లాడుతూ తన ఇంట్లో నానమ్మ మరణించిందని మంగళవారమే తెల్సింది .అయితే ఎంత దుఖకరమైన వార్త అయిన సరే బాధను దిగమింగుకుంటూ బరిలోకి దిగాను .ఎక్కడ కూడా ఏకాగ్రతను కోల్పోకుండా పట్టుదలతో ఆడి విజయవంతం అయ్యాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ మరి బాధను చెప్పేశాడు .
అయితే మనకు అకస్మాత్తుగా ఏదన్న ఊహించని పరిణామం జరిగిన ..బాధ కల్గిన చేస్తున్న పని మీద ఏకాగ్రతను కోల్పోయి తీవ్ర నిరాశలో కృంగిపోతాం .అట్లాంటిది సొంత నానమ్మ చనిపోయారని తెల్సి కూడా ఎక్కడ కూడా ఆ బాధను బయటకు చెప్పకుండా ఏకాగ్రతను కోల్పోకుండా ఇలా ఆడటం గొప్ప విషయమే కదా ..