Home / ANDHRAPRADESH / ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు …!

ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు …!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తుతం ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రధానమైన వార్త త్వరలోనే సరిగ్గా రెండు యేండ్ల కిందట పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో జైలుకు పోవడం ఖాయం ..ఇప్పటికే ఏసీబీ కేసు ఫైల్ చేసింది.అందుకు తగ్గట్లు అన్ని ఆధారాలను కూడా సంపాదించింది అని కూడా వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా జగన్ పాదయాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లా కైకలూరులో కొనసాగుతుంది.ఈ క్రమంలో కైకలూరు లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఒక యువకుడు మాట్లాడుతూ “జగనన్న గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అని దళిత సామాజిక వర్గాన్ని అవమానపరిచేలా మాట్లాడారు .

కానీ అతనిపై ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటి కేసు నమోదు చేయలేదు అన్న ..మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు చేసిన అవినీతి అక్రమాలతో పాటుగా ఈ అంశం మీద కూడా కేసు నమోదు చేసి జైలుకు పంపాలి అన్న అని కోరాడు .దీనికి సమాధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే చంద్రబాబు నాయుడు మీద నలబై రెండు కేసులు నమోదయ్యాయి.వీటిలో పద్దెనిమిది కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు .మిగతావాటిని తన అధికార డబ్బు బలంతో వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ తప్పించుకున్నాడు .కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటిని బయటకు తీసుకొస్తా అని జగన్ హామీ ఇచ్చారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat