మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు..చేసి సాధించగలడు అనేదానికి నిదర్శనమే ఈ వార్త..సాధారణంగా మనం మన ఇంట్లో వాటర్ డ్రమ్ముల ను ఏం చేస్తాం..? నీటిని నిల్వ చేసుకోవడాని ఉపయోగిస్తాం..కానీ వాటర్ డ్రమ్ముతో కూలర్ తాయారు చేశాఋ ఇద్దరు యువకులు. జయశంకర్ జిల్లా కాటారం మండలకేంద్రానికి చెందిన సాయి.. తిరుమల ఇంజనీరింగ్ అండ్ వైండింగ్ వర్క్స్‌లో పనిచేసే అప్పాల భూమేష్, అడువాల సంతోష్… ప్లాస్టిక్ డ్రమ్మును ఉపయోగించి చౌకగా కూలర్‌ను తయారు చేశారు. సుమారు రూ.700 ఖర్చుతోనే కూలర్‌ను తయారు చేసి తమ షాప్‌లో వాడుతుండటంతో పలువురు వచ్చి ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. కూలర్ మోటార్, పంప్‌ను తెచ్చి డ్రమ్ములో బిగించి, దానికి మూడువైపులా పగులగొట్టి వట్టివేర్ల తడికలు ఏర్పాటు చేశామని యువకులు తెలిపారు. గాలి, చల్లని వాతావరణం బాగానే ఉంటుందన్నారు. కూలర్‌ను పరిశీలించిన స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.