ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో గుంటూరు జిల్లాలో 993, పశ్చిమ గోదావరి జిల్లాలో 368, తూర్పు గోదావరిలో 416, అనంతపురంలో 121, నెల్లూరులో 255, కర్నూలులో 333, శ్రీకాకుళంలో 130, విజయనగరంలో 120, చిత్తూరులో 204, ప్రకాశంలో 86 మంది మహిళలపై నేరాలు జరిగిన కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద 3026 కేసులు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. నేరగాళ్లపై చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి కొవ్వొత్తి పట్టుకుని నడుస్తాడట అని ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 155వ రోజు పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రౌచౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు.
అంతేగాక దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇచ్చిన ఇంటి స్థలాలను సైతం టీడీపీ సర్కార్ వెనక్కి తీసుకుంటుందని, ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో అంతా అవినీతేనంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. కేవలం రూ.3 లక్షలు అయ్యే ప్లాట్‌ను చంద్రబాబు రూ.6 లక్షలకు అమ్ముతున్నారని.. ఇందులో రూ.3 లక్షలు పేదవాడి అప్పుగా రాసుకుంటారని తెలిపారు. మనం అధికారంలోకి వచ్చాక ఆ పేదవాడి అప్పు రూ.3 లక్షలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి ఉచితంగా ఇళ్ల కట్టించి ఇస్తామని, హౌజ్ ఫర్ ఆల్ పథకం కింద ఇల్లు ఉచితంగా కేటాయిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు.