యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ని దిగ్విజయంగా పూర్తిచేసుకుంది . కాగా ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ”అసామాన్యుడు” అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అసామాన్యుడు పెట్టాలని భావిస్తున్నారట .
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ అసామాన్యుడు తో పాటుగా మరికొన్ని పేర్లు కూడా పరిశిలీస్తున్నారు దర్శకులు త్రివిక్రమ్ . ఎన్టీఆర్ ఇప్పటివరకు రాయలసీమ నేపథ్యంలో పలు చిత్రాలు చేసాడు కానీ వాటికీ భిన్నంగా ఈ సినిమా ఉంటుందట . ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించనుంది . త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ” అజ్ఞాతవాసి ” డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు . అందుకే రాయలసీమ ఫ్యాక్షన్ ని నమ్ముకున్నాడు. టైటిల్ వింటుంటే ఎన్టీఆర్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థం అవుతోంది.