ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.గత కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పట్టణంలో బంగారం దోపిడీ కేసులో ముగ్గురు టిఆర్ఎస్ నేతలు ఇరుక్కుని కేసులపాలైన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు జిల్లా పార్టీ ఇంచార్జ్ తుల ఉమా వారిని సస్పెండ్ చేశారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త సంజయ్‌సింగ్, కౌన్సిలర్ భర్త వినోద్ పార్టీ సభ్యత్వం రద్దు చేశారు. జాంబీ హనుమాన్ ఆలయ ఛైర్మన్ రంగన్న ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు అయింది. సస్పెండ్ చేస్తున్నట్లు మంగళవారం జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి ప్రకటన విడుదల చేశారు.