చేనేత కార్మికుల సంక్షేమం కోసం మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బతుకమ్మ చీరలు, చేనేత సంక్షేమంపై ముఖ్య ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు బేగంపేట కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టెక్స్ టైల్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టియస్ ఐఐసి, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు. గుండ్లపోచంపల్లి, పాశమైలారం అప్పారెల్, టెక్స్ టైల్ పార్కులపైన మంత్రి సమీక్ష నిర్వహించారు.
Minister @KTRTRS held a review meeting with the officials from Dept of Handlooms and Textiles on Gundlapochampally and Pashamylaram textile & apparel parks. @jayesh_ranjan, Prl Secy, Industries Dept & Shailaja Ramaiyer, Director, Handlooms and Textiles participated in the meeting pic.twitter.com/OAsrtHHOHH
— Min IT, Telangana (@MinIT_Telangana) May 8, 2018
ఈ సందర్భంగా గతంలో ఒక సారి గుండ్లపోచంపల్లి పార్కులో పర్యటించి, అప్పారెల్ తో సంబంధంలేకుండా ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి అనుమతులు రద్దు చేయాలని అదేశాలు ఇచ్చిన మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పార్కులో తెలంగాణలో ఉన్న వివిధ హ్యాండిక్రాప్ట్ కళాకారులకు శిక్షణ ఇచ్చేలా ఒక శిక్షణా, నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు. గుండ్లపోచంపల్లిలో అవసరం అయిన మౌళిక వసతులను అభివృద్ది పరచాలని, పార్కు నిర్వహాణ కోసం అవసరం అయిన కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. పాశమైలారం టెక్స్ టైల్ పార్కులో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని, అక్కడ అవసరం అయిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని టియస్ ఐఐసి అధికారులకు మంత్రి అదేశాలు జారీ చేశారు.
ఈ సంవత్సరం బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమాన్ని ఏలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. మెత్తం చీరలను రాష్ర్టంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు, సెప్టెంబర్ మూడోవారంలోగా అన్ని చీరలు పంపీణీకి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికే ఈ చీరల డిజైన్లు, క్వాలీటీ ఏంపికపైన సెర్ప్ మహిళా సంఘాలతో చర్చించి పలు డిజైన్లను ఏంపిక చేసినట్లు తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కులో రోడ్లు, నీళ్లు, కరెంటు వంటి మౌళిక వసతులు పనులు చురుగ్గా సాగతున్నాయని అధికారులు తెలిపారు. సిరిసిల్లాలోని అప్పారెల్ పార్కు, గ్రూప్ వర్క్ షెడ్ల కార్యక్రమాల పురోగతిని మంత్రి సమీక్షించారు.