గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ సీఎం కేసీఆర్ బొమ్మతో కొన్ని నాణేలను తాయారు చేయించారు.వాటిని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆవిష్కరించారు.ఆ నాణేలకు ఒక వైపు కేసీఆర్ చిత్రాన్ని, మరో వైపు పార్టీ గుర్తు కారు బొమ్మను ముద్రించారు.ఇవాళ ప్రగతి భవన్ లో జరిగిన ఈ నాణేల ఆవిష్కరణ కార్యక్రమంలో కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పుల కోసం ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్న సీఎం కేసీఆర్ కు తమ మద్దతు పూర్తిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.కోర్ కమిటి మెంబర్ సురేష్ గోపతి మాట్లాడుతూ.. కేసీఆర్ పైఉన్న అభిమానంతోనే ఈ నాణేలను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ నాణేలను సీఎం కేసీఆర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని చెప్పారు .
Tags CM KCR