ఏపీలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం వైసీపీ పార్టీ అధ్యక్షుడు ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుడివాడ నియోజక వర్గంలో జరుగుతుంది. ఆశేశ జన మద్య పాదయాత్ర కొనసాగుతుంది.జగన్ తో ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే ఈ పాదయాత్ర ఎఫెక్ట్ తో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్న నేతలు వైసీపీలోకి చేరుతున్నారు.
తాజాగా విజయనగరం జిల్లాలో 50 కుటుంభాలు వైసీపీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్ర స్వామి సమక్షంలో వైసీపీలోకి వలసలు వచ్చారు. ఎమ్మెల్సీ స్వామీ వారికి వైసీపీ నార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే రోజు రోజుకు భారీగా టీడీపీ నేతలు జగన్ పార్టీలోకి చేరాడానికి గల కారణాలు ఒక్కసారి చూస్తే ..గత 4 ఏళ్ల నుండి అత్యతం దారుణంగా టీడీపీ ప్రభుత్వ పాలన ఉందని ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ నేతలే కాక…సామాన్యప్రజలు కూడ అంటున్నారు. అమలు చేయలేని 600 అపద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీకి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజా దెబ్బ..దీనికి తోడు వైసీపీ దెబ్బా రుచి చూపిస్తామని అంటున్నారు వైసీపీ నేతలు. అంతేగాక ప్రజలను కలుసుకొని సమస్యలను తెలుసుకుంటూ, ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో 2019 ఖచ్చితంగా ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ చేయ్యాడానికి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.