తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న చీకటి భాగోతాలు- కాస్టింగ్ కౌచ్ పై గత కొంత కాలంగా రచ్చ రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలామంది హీరోయిన్లు బహిరంగంగా వాళ్ళ అనుభవాలను మీడియా ముందుకు వచ్చి వివరిస్తున్నారు.అయితే తాజాగా అక్కినేని కోడలు సమంతా రుత్ ప్రభు ఈ విషయం పై స్పందించింది.ఆమె ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలను వెల్లడించారు.
అన్నిరంగాల్లో కాస్టింగ్ కౌచ్ ఉందన్నారు.కేవలం సినిమా రంగంలో మాత్రమే కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి నీచమైన సంస్కృతి ఉందని చెప్పారు. కానీ ఈ రంగం…ఆ రంగం అని నేనున వ్యక్తిగతంగా పేర్లు చెప్పదలుచుకోలేదు అని అన్నారు.అయితే అన్ని రంగాల్లో మంచి చెడు రెండు రకాలు ఉంటాయి.సినిమా ఇండస్ట్రీ లో చాలా నీచులు ఉన్నారు..నేను గత 8 సంవత్సరాలుగా తెలుగు,తమిళ ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తున్నాను.నా తొలి సినిమా మంచి విజయం సాధించడంతో నాకు మంచి హిరోయిన్ గా గుర్తింపు వచ్చింది.కానీ నాకు క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఎప్పుడూ ఎదురుకాలేదు అని చెప్పారు.
కానీ క్యాస్టింగ్ కౌచ్ కంటే సినీ ఇండస్ట్రీలో చాలా అద్భుతమైన వ్యక్తులున్నారని.., క్రియేటివిటీ ఉంది, హార్డ్ వర్క్ ఉంది..వాటిని గురించి కూడా మాట్లాడండి అంటూ సూచించారు. ప్రతి ఇండస్ట్రీలోనూ, సమాజంలోనూ బ్లాక్ షీప్స్ ఎప్పుడూ ఉంటారు. నెగిటివ్తో పాటు పాజిటివ్ గురించి కూడా మాట్లాడాలి కదా అని అక్కినేని కోడలు చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం సమంతా స్పందనపై సర్వత్రా ప్రశంశలు వినిపిస్తున్నాయి.