Home / INTERNATIONAL / హోంమంత్రిపై హత్యాయత్నం..తుపాకీతో కాల్పులు

హోంమంత్రిపై హత్యాయత్నం..తుపాకీతో కాల్పులు

పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి అషన్‌ ఇక్బాల్‌‌పై హత్యాయత్నం జరిగింది. నరోవల్‌ జిల్లాలోని తన సొంత ఊరిలో నిర్వహించిన రాజకీయ సభలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనపై ఈ దాడి జరిగింది. సభలో ప్రసంగిస్తున్న అషన్‌ ఇక్బాల్‌‌ను లక్ష్యంగా చేసుకుని ఓ ముష్కరుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో గాయపడిన ఇక్బాల్‌‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాలతో బయటపడ్డారు. పాక్‌ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన పాక్‌ సర్కారు.. విచారణను ముమ్మరం చేసింది. కాల్పులకు పాల్పడిన దుండగుడు నరోవల్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు. ఓ సాయుధుడు అషన్‌ ఇక్బాల్‌ సమీపానికి ఎలా చేరుకోగలిగాడనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. వచ్చే నెలలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న వేళ దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిపై హత్యాయత్నం జరగడం పాకిస్థాన్‌లో కలకలం రేపుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat