టీడీపీ సీనియర్ నేత – ప్రస్తుత ఎమ్మెల్సీ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుటంబానికి వీరవిధేయుడిగా ప్రకటించుకునే వ్యక్తి బుద్దావెంకన్న . చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను పొగడటంలో ముందుంటారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందనేది కొందరి వాదన. ఆ విషయం అలా ఉంచితే…మహిళలను తాము గౌరవిస్తామని – సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తామని ప్రకటించుకునే టీడీపీకి చెందిన ఈ నాయకుడు మహిళలపై స్పందించిన తీరును చూసి నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకురాలైతే..విచక్షణ మరిచి విమర్శలు చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇకపోతే ఎమ్మెల్యే రోజాపై బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు మండిపడ్డారు. బుద్దా వెంకన్న ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. దాచేపల్లి ఘటనపై ప్రశ్నించిన రోజాపై కోడి గుడ్లతో దాడి చేయిస్తామని వెంకన్న చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు.ఇలాంటి రాజకీయ సంస్కృతి కేవలం చంద్రబాబు రాజకీయ స్కూల్‌లోనే నడుస్తోందన్నారు. దుర్గమ్మ గుడి వద్ద కొబ్బరి చిప్పలు కూడా వదిలిపెట్టకుండా దోచుకుంటున్న, విజయవాడలో సెక్స్ రాకెట్ నిర్వహించిన టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్‌తో సమానమన్నారు. జబర్దస్త్ కార్యక్రమం పేరుతో రోజాను విమర్శించడాన్ని సుధాకర్ బాబు తప్పుపట్టారు.
అసలు జబర్దస్త్ కార్యక్రమం ఏ చానల్‌లో ప్రసారం అవుతోందో తెలియదా అన్నారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు దమ్ముంటే జబర్ధస్త్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న చానల్ యాజమాన్యాన్ని ప్రశ్నించాలని సుధాకర్ బాబు సవాల్ చేశారు.బుద్దావెంకన్న చెప్పినట్టు బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రోజానే ఈ చర్చకు వస్తారని…. చంద్రబాబు ఇంట్లో బహిరంగ చర్చ పెట్టినా సరే వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. నారా లోకేష్ విదేశీ మహిళలతో లోకేశ్ అసభ్య ఫొటోలు ఉన్నాయని ఇంట్లో పనివాళ్లతో అసభ్యంగా ప్రవర్తించినట్టు అభియోగాలు ఉన్నాయని గుర్తుచేశారు. వాటన్నింటిపైనా చర్చకు తాము సిద్ధమన్నారు. తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేది లేదని నోరు అదుపులో పెట్టుకోవాలని బుద్దా వెంకన్నను హెచ్చరించారు.