తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతో విపక్షాలు విలవిలలాడిపోతున్నాయని రాష్ట్ర విద్యుత్ మరియు యస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆసరా ఫించన్లనుండి కళ్యాణలక్ష్మి,కేసీఆర్ కిట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలతో రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయిన విపక్షాలకు ఈ నెల నుండి అమలులోకి రానున్న వ్యవసాయానికి పెట్టుబడి పధకం (రైతుబంధు )తో శరఘతంగా మారబోతుందని అన్నారు .
సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామ శివారు లోని లక్ష్మి తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టి నేతలు ఇవాళ హైదరాబాద్ లోని మంత్రి జగదీష్ రెడ్డి నివాస ప్రాంగణములో టీ అర ఎస్ పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబి కండువాలు కప్పి ఆహ్వానించారు . ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు.