ఏపీకి ప్రత్యేక హోదా కోసం అధికార పార్టీ టీడీపీ చేపట్టిన సైకిల్ ర్యాలీలో మరో అపశృతి చోటు చేసుకుంది. ధర్మవరంలో సైకిల్ యాత్ర చేస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వడదెబ్బతో తీవ్ర అస్వస్థకు గురై మార్గం మధ్యలో కుప్పకూలారు. హుటాహుటినా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యేను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఉదయం ఆయన పోతుకుంట నుంచి ధర్మవరం పట్టణానికి 10 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు. యాత్ర చేస్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబు కూడా సైకిల్ యాత్ర చేస్తుండగా వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
