ఏపీ ముఖ్యమంత్రి,టిడీ పీ అధినేత నారా చంద్రబాబు ఓటుకు నోటు కేసు.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.అయితే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యి.. విచారణ జరుగుతున్న ఏసీబీ కేసుల పురోగతిని సమీక్షించారు .ఈ సమీక్షలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన ఓటుకు నోటు కేసు వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు.
రికార్డ్ అయిన వాయిస్ పై ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమని వచ్చింది.. నివేదిక ఏం చెబుతుంది అనే వివరాలను సీఎం కేసీఆర్ అధికారుల నుంచి తెలుసుకున్నారు.అయితే ఫోరెన్సిక్ నివేదిక రావటంతో.. ఓటుకు నోటు కేసులో మళ్లీ చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు న్యాయనిపుణులు.ఈ క్రమంలో బాబు కూడా త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇవాళ జరిగిన ఈ సమీక్షలో ఈ కేసును గతంలో డీల్ చేసిన ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ కూడా హాజరైనట్లు విశ్వసనీయ సమాచారం.