తమ కష్టాన్ని నమ్ముకొని..దేశానికి అన్నం పెట్టె రైతన్నల కోసం ఏం చేసినా తక్కువే..ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది.అయితే రైతన్న కోసం నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రూ.5తో రైతులకు భోజనం అందిస్తున్నారు.అన్నం, పప్పు, పచ్చడి, మూడు రకాల కూరలతో రైతులకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు.
మర్చంట్స్ అసొసియేషన్ – అమ్మానాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో సద్దిమూట పేరుతో ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ప్రతిరోజు వెయ్యి నుంచి 1500 మందికి ఈ రూ.5 భోజనం అందిస్తున్నారు ట్రస్ట్ వారు .అయితే ఈ కార్యక్రమం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకుముందు భోజనం చేయాలంటే హోటల్స్ లో ధరలు చెల్లించాల్సి వచ్చేదని… యార్డ్ లోనే సద్దిమూట మా ఆకలి తీరుస్తుందని అన్నదాతలు అంటున్నారు.