సుడిగాలి సుధీర్, బుల్లితెరతోపాటు వెండితెర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటుల్లో ఒకరు. అదే స్థాయిలో గాసిప్స్‌కు కేరాఫ్ అడ్రస్ సుడిగాలి సుధీర్. అటు బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూ.. వెండితెరపై తనదైన శైలి నటనతో రాణిస్తున్న రష్మీ, సుధీర్ లపై వచ్చినన్ని గాసిప్స్ మరెవరిపై రాలేదన్నది సినీ జనాల అభిప్రాయం. అంతేకాకుండా, రష్మీ, సుధీర్‌లు కలివిడిగా ఉంటూ ప్రోగ్రామ్స్ చేయడం వల్లే.. టీవీల రేటింగ్స్ పెరుగుతున్నాయని, వారిద్దరు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారన్న గాసిప్స్ టాలీవుడ్లో వినిపించాయి.
ఇదిలా ఉండగా.. ఇటీవల సుడిగాలి సుధీర్ దగ్గరుండి మరీ తన తమ్ముడి పెళ్లిని జరిపించిన విషయం తెలిసిందే. త్వరలోనే సుడిగాలి సుధీర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని, అయితే, సుధీర్ పెళ్లి రష్మీతో ఉండదని, అమ్మాయి కోసం సుడిగాలి సుధీర్ తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ కథనం వైరల్ అయింది.
ఇదే గనుక జరిగితే.. రష్మీ, సుధీర్‌లపై ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడ్డట్టే.