2016లో ఆస్ట్రేలియా లో టీఆర్ఎస్ ని స్థాపించి మొదటి సారి అధ్యక్షుడిగా ఎన్నికై , పార్టీని ఆస్ట్రేలియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్థాపించి, ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాలలో గులాబీ జెండాని ఎగరేశారు అలాగే అత్యధిక సభ్యత్వ నమోదుచేసి , ఖండాంతరాలలో పార్టీ కార్యక్రమాలను , అభివృద్ధి , సంక్షేమ పథకాలను తెలియచేస్తూ , ప్రతిపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పి కొడుతూ అటు సోషల్ మీడియా లో ఇటు తెలంగాణ లో పార్టీ నిర్వహించే కార్యక్రమాలలో భాగస్వాములవుతూ పార్టీ అధిష్టానం వద్ద్ద మంచి గురింపు తెచ్చుకున్న కాసర్ల నాగేందర్ రెడ్డి ని మల్లి అధ్యక్షుడి గా పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ,కల్వకుంట్ల కవితనియమించారు .
ఇటీవలే 17 వ ప్లీనరీ కై విచ్చేసిన నాగేందర్ రెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ నాగేందర్ ని అభినందించారు . తన నివాసం లో కలిసిన నాగేందర్ కి కవిత నియామక ఉత్తర్వులు అందజేశారు . నాగేందర్ తో పాటు అడ్వైసరి బోర్డు చైర్మన్ గా డా అనిల్ రావు చీటీ , వైస్ ప్రెసిడెంట్ గా రాజేష్ గిరి రాపోలు , వివిధ రాష్ట్రాల కన్వీనర్ లుగా సాయి రామ్ ఉప్పు , ప్రవీణ్ పిన్నమ, రవి సాయల,శ్రీకాంత్ రెడ్డి సాదం లను నియమించారు. దాదాపు 120 మంది తో భారీ కారవర్గాన్ని ప్రకటించారు . ఈ సందర్భంగా తన పై నమ్మకం ఉంచి మల్లి నియమించిన కెసిఆర్, కవిత లకు నాగేందర్ రెడ్డి తో పాటు, కొత్తగా నియమించిన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు .