ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. పెడన నియోజకవర్గంలోని కొంకెపూడి శివారు నుంచి ఆదివారం ఉదయం 154వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. అడుగడునా జననేతకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మరి కొంతమంది వారి భాదలను జగన్ తో చెప్పుకుంటున్నారు. అన్నా…వారం రోజులనుంచి తాగునీరు సక్రమంగా రావడంలేదు.అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కనీసం ఈ ప్రభుత్వం జనానికి గుక్కెడు నీటిని ఇవ్వకుండా చోద్యం చూస్తోంది.’ అని పెడన ఎన్టీఆర్ కాలనీకి చెందిన అల్‌షాహినా, సువార్తమ్మ, లక్ష్మితో పాటు పలువురు మహిలలు జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మహిళలు పలు సమస్యలను జగన్ కు వివరించారు. ఒకే ఇంటిలో కనీసం 5 కుటుంబాలు ఉంటున్నామని వారం రోజులకు ఒకసారి కేవలం 5 బిందెలు నీరు ఇస్తే దాహం ఎలా తీరుతుందని జగన్ వద్ద తమగోడు వినిపించారు. మంచినీరు పంపుల ద్వారా ఇవ్వకపోతే మినరల్ వాటర్ ప్లాంట్‌లకు టోకెన్లు ఇస్తున్నారని, ఈ నీరు ముందు వచ్చినవారికే ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని వైఎస్ జగన్ కు వివరించారు.
