1983లో వైశ్రాయ్ హోటల్ వేదికగా నాడు చంద్రబాబు నాయుడు నడిపిన కుఠిల రాజకీయాలే గతంలో ఆయన్ను ముఖ్యమంత్రి చేశాయన్నది జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో చంద్రబాబు తను అనుకూల ఎమ్మెల్యేలతో చర్చలు జరిపించి, మీరు ఒక్కరు తప్పా అందరూ చంద్రబాబు వైపే ఉన్నారు.. అంటూ అలా.. అలా ప్రతీ ఒక్కరితోనూ మీరు తప్ప మిగతా వారంతా చంద్రబాబు వైపే ఉన్నారంటూ ప్రచారం చేయించి, ఎన్టీఆర్ వైపు ఉన్న ఎమ్మెల్యేలందర్నీ వైశ్రాయ్ హోటల్‌లో బంధించేశారు. ఇలా చంద్రబాబు తన కుఠిల రాజకీయ, వెన్నుపోటు రాజకీయ ప్రస్థానాన్నినాటి నుంచే ప్రారంభించారనే విషయం ఏపీ రాజకీయాల గురించి తెలసిన ప్రతీ ఒక్కరికి విధితమే.
see also : వైసీపీ తీర్ధం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ..!
వైశ్రాయ్ హోటల్ రాజకీయాన్ని ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు అవలంభిస్తున్నారని, ఒకసారి ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ కావాలని, మరో సారి ప్రత్యేక ప్యాకేజీ వద్దు.. హోదా కావాలంటూ ఇలా ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు పన్నని కుయుక్తులు లేవంటే అతిశయోక్తి కాదేమో మరీ.
అయితే, నాడు టీడీపీ నుంచి చంద్రబాబును బహిష్కరిస్తూ నాటి స్పీకర్‌కు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే, నాడు టీడీపీ నుంచి చంద్రబాబును బహిష్కరిస్తూ నాటి స్పీకర్‌కు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా, ఈ లేఖను ఎన్‌టీఆర్ 1994లో రాసినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ లేఖలో చంద్రబాబుతోపాటు మరో నలుగురిని బహిష్కరిస్తూ ఎన్టీఆర్ వారి పేర్లను ప్రస్థావించారు. అశోక గజపతిరాజు, దేవేందర్ గౌడ్, కోటగిరి విద్యాధరరావు, మాధవరెడ్డిల పేర్లను ఎన్టీఆర్ ప్రస్థావించారు. అయితే, అశోక గజపతిరాజు ఇటీవల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయగా, దేవేందర్‌గౌడ్ రాజ్యసభ సభ్యుడిగా పదవి అనుభవించి ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక కోటగిరి విద్యాధరరావు, మాధవరెడ్డి మృతి చెందారు.