ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్ టాపర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2013 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన అనుదీప్.. ఐఏఎస్ లక్ష్యంగా సాధన చేస్తూ నాలుగో ప్రయత్నంలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించారు.ఈ క్రమంలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నుంచి పిలుపు అందింది. అనుదీప్, ఆయన తల్లిదండ్రులను సోమవారం ప్రగతి భవన్‌కు రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. వారితో కలిసి సీఎం భోజనం చేయనున్నారు.
సివిల్స్ లో ఆలిండియా టాపర్ గా తెలంగాణ బిడ్డ నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు…
Posted by Telangana CMO on Sunday, 6 May 2018
అనుదీప్ ప్రస్తుత జగిత్యాల (పాత కరీంనగర్ జిల్లా) జిల్లా మెట్‌పల్లి వాసి. ఆయన తండ్రి దురిశెట్టి మనోహర్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్. తల్లి జ్యోతి గృహిణి. వీరి కుటంబం మెట్‌పల్లి పట్టణంలోని ఆదర్శ్ నగర్‌లో నివాసం ఉంటోంది.