వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ప్రస్తుతం కృష్ణా జిల్లా పెడన గుడివాడ నియోజకవర్గంలోని భీమవరంలో 154వ రోజు కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అడుగడుగునా జగన్ తన పాదయాత్ర ద్వారా నడిచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ స్వయంగా తెలుసుకుని.. సమస్యలను పరిష్కార మార్గాలను అన్వేశిస్తూ తన
ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్.
కాగా, భీమవరంలో ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌ను నూతన వధూవరులు కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కాసేపు వారితో ముచ్చటించారు. తాము కొండలమ్మ తల్లి ఆలయం వద్దకు వచ్చామని, ఏప్రిల్ 27న పెళ్లి జరిగిందని జగన్‌తో చెప్పారు. అనంతరం నూతన వధూవరులను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. మరికొద్ది నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని, భయపడవద్దంటూ వారికి జగన్ భరోసా ఇచ్చారు.