ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, చంద్రబాబుకు ఛాన్స్ ఇస్తే.. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించమని దేవుడికి చెప్పింది తానేనంటూ చంద్రబాబు చెప్పినా చెబుతాడంటూ సినీ క్రిటిక్ కత్తి మహేష్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వంతు ఓ ప్రముఖ ఛానెల్‌లో యాంకర్ వంతొచ్చినట్టుంది. చంద్రబాబుపై తనదైన శైలిలో పంచ్‌లు పేలుస్తూ.. ప్రాసలు వదిలింది.
అయితే, ఇటీవల తిరుపతిలో నిర్వహించిన టీడీపీ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. బ్రిటీష్ వాళ్ల మీద పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మాటలనే ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆ యాంకరమ్మ కౌంటర్ ఇలా..
see also : కొత్త పెళ్లి కొడుక్కి భార్య అశ్లీల ఫోటోలు..ఎవరు పంపారో తెలిస్తే షాక్ అవుతారు..!!
భారత జనతకు వందనం.. భారత యువతకు అభివందనం.. భారత జాతికి శుభాభివందనం.. తెల్లోడు దేశాన్ని దోచుకుంటుంటే సహించలేక.. మన వనరులు తరలిస్తుంటే వేచి చూడలేక.. మీ కోసం వచ్చాను.. ఈ పార్టీ దేశ భక్తుల చమటలోనుంచి పుట్టింది.. వీరుల త్యాగాల్లోనుంచి పుట్టింది.. కోట్ల మంది ఆలోచనలోనుంచి.. జనం ఆవేదనలో నుంచి.. ఆక్రందనల నుంచి పుట్టింది ఈ పార్టీ.. మమ్మల్ని ఆశీర్వదించండి.. బ్రిటీషోళ్ల మీద పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ..
see also : వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలవడానికి ప్రధాన కారణం ఇదే..
ఇంకా నయం.. బ్రిటీషోళ్ల మీద పోరాడమని గాంధీ తాతకు చెప్పింది తానేనని చంద్రబాబు చెప్పలేదు.. లేకుంటేనా..! దేశానికి స్వాత్రంత్యం వచ్చింది 1947లో. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ టీడీపీ స్థాపించింది 1982లో అంటే.. స్వాతంత్ర్యం వచ్చిన 35 ఏళ్ల తరువాత టీడీపీని స్థాపించారు.
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద నోట్లు రద్దు చేయమని సలహా ఇచ్చింది నేనేనంటూ మీడియా ముఖంగా ఢంకా బనాయించిన చంద్రబాబు, తీరా నరేంద్ర మోడీ నోట్లు రద్దు చేసిన తరువాత.. నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మన డబ్బును మనం తీసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన ఖర్మ పట్టింది అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అయితే, గతంలో సీఎం చంద్రబాబు నోట జారిన ఆణిముత్యాలు మరికొన్ని మీ కోసం..
అబ్దుల్ కలాంని భారతదేశానికి రాష్ట్రపతిని చేసింది నేనే..!!
సత్యనాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈవోగా చేసింది నేనే..
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ స్థాయిలో ఉండటానికి కారణం నేనే
400 సంవత్సరాల చరిత్రగల హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పారు..
సెల్‌ఫోన్‌ను ఇండియాకు తీసుకొచ్చింది తానేనని చెప్పారు..
ఇలా సీఎం చంద్రబాబు నెటిజన్లకు టార్గెట్ అయ్యారు.