ఏపీలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా వైసీపీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రేపు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్య క్యాండిల్ ద్వారా నిరసన తెలిపాలని ఆయన వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. అలాగే.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో చంద్రబాబు విఫలమయ్యారని వెల్లడించారు.
ఇంకా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… మే 14 న వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రెండువేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంటుంది. ఆ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో మే 14, 15వ తేదీన అన్ని మండలాల్లో పార్టీ శ్రేణులు పాదయాత్ర చేపడతారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మే16వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద గర్జన పేరుతో ధర్నా కార్యక్రమంతో ప్రజల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. 13 జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల వద్ద గర్జన కార్యక్రమం చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో మాఫియాలను తయారు చేసిన పార్టీగా టీడీపీ ప్రస్తుతం ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు