ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది ..ఒక్కటి కాదు రెండు దాదాపు యాబై వేల మెజారిటీతో గెలుపొంది ఆ తర్వాత ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశ పెట్టిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు .చేరిన మొదట్లో అంత సవ్యంగానే ఉంది .కానీ ఆ తర్వాత గతంలో ఆ నియోజకవర్గం నుండి గెలుపొంది మంత్రిగా పని చేసిన ఒక మాజీ మంత్రి తనయురాలు చక్రం తిప్పడంతో ఆయనకు ఎమ్మెల్యే అయి ఉండి పనులు జరగక్కపోవడంతో తీవ్ర అవమానాలను ఎదుర్కుంటున్నాడు .ఇంతకూ ఆయన ఎవరు అని అలోచిస్తున్నరా ..?ఆయనే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జయరాములు .
బద్వేల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వీరారెడ్డి తనయ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ,ఎమ్మెల్యే జయరాములు మధ్య ఎప్పటి నుండో వైరం ఉంది .వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత ఎక్కువైంది .ఇక చేసేది ఏమి లేక నియోజకవర్గంలో అసలు తలెత్తుకోలేక పోతున్నాడు .ఇటు పార్టీ సంబంధిత కార్యక్రమాల్లో అటు అధికారక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జయరాములును విస్మరిస్తున్నారు ఆ పార్టీ నేతలు .
అయితే విజయమ్మ ఉన్నత సామాజిక వర్గానికి చెందటం ..ఎమ్మెల్యే జయరాములు దళితుడు కావడంతోనే ఇలా పలు అవమానాలకు గురిచేస్తున్నారు అని ఆయన వాపోతున్నారు .అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున వ్యక్తికీ సీటు ఇవ్వాలని ..జయరాములును అడ్డు తొలగించుకోవడానికి ఇలా కుట్రలు పన్నుతున్నారు .కావాలనే అధినేతకు తెల్సిన కానీ పట్టించుకోవడంలేదు అని సదరు ఎమ్మెల్యే అనుచవర్గం చెబుతున్నారు .మరో రెండు రోజుల్లో తమ సమస్యను పరిష్కరించకపోతే వైసీపీ నుండి వచ్చిన నేతలతో సహా టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తామని ఆయన చంద్రబాబును హెచ్చరించారు ..అయితే భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామని ఎమ్మెల్యే చెప్పారు ..