నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో భాగంగా చేపట్టిన నిరసన ర్యాలీలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో తెలంగాణ విద్యార్ధి సమితి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మున్నూరు రవికి ఆరునెలల జైలు శిక్ష పడింది.గురువారం మహబూబ్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి ..జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
ఈ క్రమంలో రవిని కస్టడీ లోకి తీసుకోగా రెండు రోజులు గడువు ఇవ్వాలని పిటీషన్ వేశారు.రేపటిలోగా ఇద్దరు సాక్షులను ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.శనివరంలోగా షురిటీ లు సమర్పించకపోతే రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది.
I’ll personally discuss today with Home Minister Nayini Garu & @TelanganaDGP Garu to make sure the agitation cases are all addressed in one go https://t.co/KAxy0ujYhm
— KTR (@KTRTRS) May 4, 2018
అయితే ఈ విషయం పై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.ఇవాళ ఉదయం ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కు మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ..ఉద్యమకారుల మీద ఎక్కడైనా కేసులు మిగిలి ఉంటే దాన్ని ఒకేసారి ఎత్తివేయాలని…దాని గురించి హోం మంత్రి నాయిని నరసింహ రెడ్డి గారితో మరియు డీజీపీ గారితో స్వయంగా చర్చిస్తానని హామీ ఇచ్చారు.