రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట నిలబెట్టుకున్నారు. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమకారులపై కేసుల నమోదు విషయంలో హోంమంత్రితో చర్చించనున్నట్లు మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని వెంటనే ఆచరణలో పెడుతూ సమావేశమయ్యారు. ఇవ్వాళ సచివాలయంలో హోం మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పెండింగులో ఉన్న కేసుల పై చర్చ జరిగింది. ఈ సమవేశంలో డిజీపీ మహేందర్ రెడ్డి, హోం సెక్రటరీ రాజీవ్ త్రివేది, న్యాయ శాఖ సెక్రటరీ నిరంజన్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం పెండింగ్ కేసులపైన హోం మంత్రి, డిజిపిలతో చర్చస్తానని మంత్రి కెటి రామారావు తెలిపిన నేప్యధ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
రాష్ట్ర సాధన ఉద్యమంలో నమోదైన అత్యధిక కేసులను ఎత్తివేశామని, టెక్నికల్ కారణాల వల్ల, సమాచార లోపం వల్ల ఏమైనా కేసులు మిగిలివుంటే వాటిని కూడా అతి త్వరలో ఎత్తివేస్తామని మంత్రులు నాయిని నరసింహా రెడ్డి, జగదీష్ రెడ్డి, @KTRTRS తెలిపారు pic.twitter.com/ki3ekcAdcD
— Min IT, Telangana (@MinIT_Telangana) May 4, 2018
ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ర్ట డీజీపీ ఇప్పటికి కొన్ని కేసులు మాత్రమే వివిధ కారణాల చేత పెండింగ్లో ఉన్నాయని మంత్రులకు తెలిపారు.
ముఖ్యంగా కొన్ని కేసుల్లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగినది అని ప్రత్యేకంగా కేసు షీట్లో రాయకపోవడం వంటి సాంకేతిక కారణాలతో అతి తక్కువ కేసులు మాత్రమే పెండిగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వతా ఇచ్చిన మార్గదర్శకాలకు అనుకూలంగా ఉన్న అన్ని కేసులను ఇప్పటికే మాఫీ చేశామని డీజీపీ మంత్రులకు తెలిపారు. అయితే టెక్నికల్ కారణాల వల్ల, సమాచార లోపం వల్ల ఒకటీ అరా కేసులేమైనా మిగిలి ఉంటే వాటిని కూడా అతి త్వరలో ఎత్తివేయాలని మంత్రులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. రెండు వారాల్లో పోలీస్ శాఖ పెండింగులో ఉన్న ఉద్యమ కేసుల పూర్తి వివరాలతో రావాలని మంత్రులు డీజీపీని కోరారు. ఇదే సమయంలో పార్టీ వైపు నుండి కూడా సమాచార సేకరణ చేస్తామని, ఇదంతా క్రోడికరించి మరోసారి సమావేశమై ఈ కేసుల ఎత్తివేతకు మార్గం సుగమం చేయాలని మంత్రులు నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియను డీజీపీ కార్యాలయంలోని ఒక సీనియర్ అధికారి పర్యవేక్షించి సాద్యమైనంత త్వరలో అన్ని కేసులను మాఫీ చేస్తామని మంత్రులకు డిజిపి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో కాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేసుల ఎత్తివేత మొదలుపెట్టామని, ఇప్పటికే కేసులు ఎత్తివేస్తూ 1138 జీవోలు జారీ చేసి వేలాది మంది ఉద్యమకారులకు ఉపశమనం కలిగించినట్టు సమావేశంలో @TelanganaDGP తెలిపారు
— Min IT, Telangana (@MinIT_Telangana) May 4, 2018
ఈ సమావేశనంతరం రాష్ట్ర మంత్రులు నాయిని, జగదీష్ రెడ్డి, కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపైన ఉన్న కేసుల్లో మెజారిటీ కేసులను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసిందని… పెండింగులో ఉన్న కొద్దిపాటి కేసులు కూడా అతి త్వరలో ఎత్తివేస్తామని తెలిపారు. హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో కాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేసుల ఎత్తివేత మొదలుపెట్టామని, ఇప్పటికి కేసులు ఎత్తివేస్తూ 1138 జీవోలు జారీ చేసి వేలాది మంది ఉద్యమకారులకు ఉపశమనం కలిగించినట్టు తెలిపారు. ఇంకొక 19 కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వంలో వివిధ దశల్లో ఫైళ్లు ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఉద్యమ కేసుల సమాచారం అందించడానికి contact@trspartyonline.org లేదా వాట్సాప్ ద్వారా 8143726666 నెంబర్‌కు పంపవచ్చని సూచించారు. దీంతోపాటు హోంశాఖకు నేరుగా తమ వివరాలు అందజేయవచ్చని మంత్రులు తెలిపారు. ఉద్యమ సమయంలో పెట్టిన కొన్ని రైల్వే కేసుల్లో పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు ఇతర నాయకులు కూడా ఇంకా కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని. అయితే ఇవి కేంద్ర పరిధిలో ఉన్నందువల్ల వాటిని వేరుగా పరిష్కరించాలని సమావేశంలో మంత్రులు అన్నారు.