ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ,జనసేన భాగస్వామ్యంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై కేవలం ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో మాత్రమే అధికారాన్ని పీఠాన్ని దక్కించుకుంది .అయితే రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అంటూ మోస్ట్ సీనియర్ జర్నలిస్టు అయిన ఇలపావులూరి మురళీ మోహన రావు గారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఒకటి వైరల్ అవుతుంది .మీరు ఒక లుక్ వేయండి ..
1 . నాడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తుపెట్టుకుని పోటీ చేశాయి. జనసేన పోటీ చెయ్యకపోయినా పవన్ తన కులం, అభిమానుల ఓట్లను తెలుగుదేశం వైపు మళ్లించగలిగాడు. నేడు ఆ
పరిస్థితి లేదు. ఎవరికీ వారే యమునాతీరే అయ్యారు.
2 . జనసేన బలం ప్రతి నియోజకవర్గంలోనూ రెండు వేలనుంచి పదివేల వరకూ ఉంటుంది. అనగా సుమారు అయిదు లక్షల జనసేన ఓట్లు తెలుగుదేశం కు రావు.
3 . కాపులు గనుక జనసేన వెంట నడుస్తారు, ముద్రగడ ను అనుసరిస్తారు అనుకుంటే వారి జనాభాలో సుమారు డెబ్బై శాతం మంది తెలుగుదేశంకు ఓట్లు వెయ్యరు.
4 . ఆరు లక్షలమంది ఉద్యోగస్తులు చంద్రబాబు మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
5 . అగ్రిగోల్డ్ బాధితులు సుమారు 19 లక్షలమంది ఉన్నారు. వారికి ఇంతవరకు న్యాయం జరగలేదు. వారి నష్టం విలువ పదకొండువేలకోట్లు అని గతంలో కోర్టులు అఫిడవిట్ వేయించిన
తెలుగుదేశం మొన్న రెండున్నరవేల కోట్ల రూపాయలు అని విలువ తగ్గించడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితుల్లో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ బాధితులు ఎవ్వరూ తెలుగుదేశం కు
ఓట్లు వెయ్యరు. అగ్రిగోల్డ్ చైర్మన్ బ్రాహ్మణుడు కావడం వల్లనే వేధిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇది బ్రాహ్మణుల ఆగ్రహానికి కారణం అవుతున్నది.
6 . దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అవినీతిలో అగ్రస్థానంలో ఉన్నది అని కేంద్ర సంస్థలు ప్రకటించడం పట్ల ఆంధ్రులు కుపితులై ఉన్నారు.
7 . గడచిన నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ రాకపోయినా, ఒక్క పరిశ్రమ రాకపోయినా, ఒక్క ఉద్యోగం రాకపోయినా, లక్షలకోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెప్పడం పట్ల నిరుద్యోగులు
ఆగ్రహావేశాలతో ఉన్నారు. వారికి ఇస్తామన్న నిరుద్యోగభృతి ఇంతవరకూ ఇవ్వలేదు. వారు తెలుగుదేశం కు ఓట్లు వెయ్యరు.
8 . పారిశ్రామికంగా ముందంజలో ఉన్న గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర కంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటులో పదకొండు శాతం సాధించింది అని చెప్పడం పట్ల పురజనులు
మండిపడుతున్నారు.
9 . భాగస్వామ్య సదస్సుల్లో లక్షలకోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని, ఇప్పటికి రెండు లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని ప్రభుత్వం చెప్పే కోతలను ఎవ్వరూ విశ్వసించడం లేదు.
10 . ఇక సదవర్తి, విశాఖ భూముల కుంభకోణాల వెనుక తెలుగుదేశం నేతలు ఉన్నారన్న వాస్తవాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ కారణంగానే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు
జరిపించడానికి ప్రభుత్వం భయపడుతున్నదని ప్రజలకు అర్ధమయింది.
11 . యాభై వేల ఎకరాల సస్యశ్యామల భూక్షేత్రాలను అభివృద్ధి పేరుతో గత మూడున్నర ఏళ్లుగా బీడు పెట్టి, పంటల దిగుబడి పెరిగిందని చెప్పడం పెద్ద మాయ అని జనానికి అర్ధమయింది అని పెట్టిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.