తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రజలకు కష్టం వస్తే అది ముఖ్యంగా తనకు తెలిస్తే ఎలా స్పందిస్తారో అందరికి తెల్సిందే .అవసరమైతే ఓఎస్డీ ద్వారా లేకపోతే తనే స్వయంగా వెళ్లి వారి సమస్యను పరిష్కరించి వారి కళ్ళలో ఆనందాన్ని చూసే వరకు నిద్రపోరు .
తాజాగా నంగునూర్ గ్రామానికి చెందిన సుద్దాల ఎల్లవ్వ(70) అనే మహిళ కు తేదీ 01 .05.2018 మంగళవారం రోజు నాడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతుంటే సిద్దిపేట ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించారు.అయితే వైద్యులు హైదరాబాద్ కు తీసుకెళ్ళాలి అని చెప్పారు .అయితే అక్కడ ప్రైవేటు ఆస్పత్రిలో చూయిస్తే సుమారు 2లక్ష పై చిలుక వరకు ఖర్చు అవుతుంది అని వైద్యులు చెప్పడంతో ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితులలో సుద్దాల రంజిత్ తన మొబైల్స్ లో ఉన్న ఆకుబత్తిని రాము అనే యువకుడికి పరిస్థితి వివరించడం జరిగింది.
దీంతో వెంటనే ఈ విషయం గురించి ఒక్క మెసేజ్ ద్వారా ఆర్ధరాత్రి మంత్రి హరీష్ రావు కి ఆకుబత్తిని రాము తెలియజేయండం జరిగింది .అంతే కాకుండా కాల్ చేసి కూడా మాట్లాడి చెప్పడం జరిగింది .దీంతో మంత్రి హరీష్ తన పీఏ కృషారెడ్డికి ఇన్ఫోర్మ్ చేసి గాంధీ హాస్పిటల్ డాక్టర్ లతో మాట్లాడారు .అర్థరాత్రి ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత ఎల్లవ్వ కోలుకుంటున్నారు .దీంతో కుటుంబ సభ్యులు ఆపదలో ఆదుకున్న మంత్రి హరీష్ రావు కి , పీఏ కృష్ణారెడ్డికి ,ఆకుబత్తిని రాముకి తెలిపారు ..