తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కేంద్రం కావాలని 60ఏళ్ల కోరిక అ జిల్లా ప్రజాలది అని.. అది నిజం చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా కేంద్రంలో అయన మీడియాతో మాట్లాడుతూ..
ఎన్నో ప్రభుత్వాల పోయాయి.. అక్కడి ప్రజలు ఎన్నో ఉద్యమాలు ,ఆందోళను చేసిన ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2016 అక్టోబర్ 10 దసరా రోజున జిల్లా కేంద్రంగా మెదక్ జిల్లా ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు .అది కేసీఆర్ సీఎం కావడం వల్లనే ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారూ మంత్రి హరీష్ రావు .
జిల్లా ఏర్పాటు అయింది.. కలెక్టర్ కార్యాలయం కూడా ఏర్పాటు చేయాలని నూతన కలెక్టర్ కార్యాలయానికి ఈనెల 9న సాయంత్రం 4గం. లకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు.. ఈ సభకు జిల్లా ప్రజలు పెద్దఎత్తున పాల్గొని సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపి సభను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.