సబ్బండ వర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం తీరు అనేక రాష్ర్టాలకు స్ఫూర్తిదాకంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ర్టాల మంత్రులతో పాటుగా కేంద్రమంత్రులు సైతం మన పథకాలను అభినందించాయి. ఇవి ఇతర రాష్ర్టాలకు ఆదర్శమని పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన మ్యానిఫెస్టోలేనే ఈ పథకాలను దింపేసింది. కర్ణాటక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని వెల్లడించింది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Imitation is the best form of flattery: Delighted that various welfare & development schemes of @TelanganaCMO have been picked up by BJP in Karnataka polls
1) Mission Kakatiya as ‘Mission Kalyani’
2) Kalyana Lakshmi as ‘Vivaha Mangala Yojana’
3) Farm Loan waiver of 1 lakh1/2 pic.twitter.com/ZavKmUDbQO
— KTR (@KTRTRS) May 4, 2018
కర్ణాటక బీజేపీ మేనిఫెస్టోపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వ పథకాలను బీజేపీ తన మ్యానిఫెస్టోల పెట్టడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుచేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న తీరుకు ఇది నిదర్శనమని వెల్లడించారు. కాగా సాక్షాత్తు బీజేపీ పార్టీ మన పథకాలను యథావిధిగా తమ మ్యానిఫెస్టోలో పొందుపర్చడంతో ఇప్పటికైనా బీజేపీ నాయకులు విమర్శలు మానుకోవాలని పలువురు పేర్కొంటున్నారు.
4) TS-IPASS inspired single window clearance for industries
5) ‘K-Hub’ inspired by T-Hub
6) ‘Mukhya Mantri Annapurna Canteens’ inspired by @GHMCOnline Annapurna initiative2/2 pic.twitter.com/wxhFqERiIF
— KTR (@KTRTRS) May 4, 2018
బీజేపీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలివి
* మిషన్ కాకతీయ- మిషన్ కళ్యాణి
* కల్యాణలక్ష్మీ- వివాహా మంగళ యోజన
* చేనేత రుణాలు రూ. లక్ష వరకు రుణమాఫీ
* టీఎస్ ఐపాస్ తరహాలో పరిశ్రమలకు అనుమతులు
* టీ హబ్- కే హబ్
* జీహెచ్‌ఎంసీ రూ. 5 భోజన పథకాన్ని ముఖ్యమంత్రి అన్నపూర్ణ క్యాంటిన్స్‌గా తమ మేనిఫెస్టోలో బీజేపీ పొందుపరిచింది.