Home / TELANGANA / జీహెచ్ఎంసీ వర్షాకాల సన్నద్ధతపై మంత్రి కేటీఆర్ సమీక్ష

జీహెచ్ఎంసీ వర్షాకాల సన్నద్ధతపై మంత్రి కేటీఆర్ సమీక్ష

రానున్న వర్షకాలం నేపథ్యంలో నగరంలో ఏదురయ్యే అన్ని పరిస్ధితులకు సర్వం సన్నద్దంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  జియచ్ యంసి అధికారులను అదేశించారు. ఈ రోజు జరిగిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో మంత్రి వర్షకాల సంసిద్దత పైన నగర మేయర్ బొంతు రామ్మోహాన్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నిన్నటి భారీ వర్షాలకు ఏదురైన పరిస్ధితులు, వాటిని ఏదుర్కోన్న తీరుపైన అధికారులు మంత్రికి వివరాలు అందించారు. ముఖ్యంగా నాలాల్లో ఉన్న అడ్డంకులు, పూడిక తీతను తొలగించాలని మంత్రి అధికారులను అదేశించారు. ఇప్పటికే ఈ నాలా అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం నిధులను సైతం కేటాయించిందన్నారు. నాల అక్రమణల్లో ఉన్న వారి సామాజిక పరిస్ధితులను అర్ధం చేసుకుని వారికి తగిన అర్ధిక పరిహారంతోపాటు అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు.

నాలాల మరమత్తుల కోసం గుర్తించిన పనులను వేంటనే ప్రారంభించాలన్నారు. వర్షకాలంలో కీలకమైన వాటర్ లాంగింగ్( నీళ్లు నిల్వడం) పాయింట్లు, రోడ్ల నిర్వహాణపైన ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ట్రాఫిక్, పోలీసు, జియచ్యంసి గుర్తించిన నీళ్లు నిలిచే ప్రాంతాల్లో సాద్యమైనంత వరకు శాశ్వత ప్రాతిపాధికన పనులు నిర్వహించాలని, అలాంటి పరిష్కారం సాద్యం కాకుంటే వర్షకాలం మేరకు తక్షణ పరిష్కార మార్గాలు(డీ వాటరింగ్ పంపులు) ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే జియచ్యంసి వద్ద సూమారు 100 పంపులు అందుబాటులో ఉన్నాయని, అవసరం అయితే ఈ సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు మంత్రికి తెలిపారు.

వాటర్ వర్క్స్ పరిధిలోని వాటర్ సీవేజీ, స్ట్రామ్ వాటర్ డ్రయినేజీలు, మ్యాన్ హోళ్ల నిర్వహాణపైన శ్రద్ద వహించాలన్నారు. రోడ్ల నిర్వహణలో భాగంగా రోడ్డు కట్టింగ్ పునరుద్దరణ పనులు, పాట్ హోళ్ల నిర్వహాణతోపాటు రోడ్లపై బిటి లేయింగ్ , వాటి పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. వర్షకాల సన్నద్దత పనుల కోసం ఇప్పటి నుంచే జియచ్ యంసి విపత్తు నిర్వహాణ విభాగంతో ఇతర విభాగాలు కలసి సమన్వయంతో ఒక ప్రణాళిక తయారు చేయాలన్నారు. నగరంలో పలు చోట్ల ప్రమాధం సంభవించేందుకు ఏమాత్రం అవకాశం ఉన్న అలాంటి చోట్ల హోర్డింగ్లు, తొరణాలను వేంటనే తొలగించాలన్నారు. సోషల్ మీడియాతోపాట వివిధ మాద్యమాల ద్వారా తమ దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారంలో మరింత చొరవ చూపించాలని, సోషల్ మీడియా ద్వారా ఏప్పటికప్పుడు తాము చేస్తున్న పనులను పౌరులతో పంచుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat