కర్ణాటక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరందుకుంది.ఎన్నికల ప్రచార సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రచారం నిర్వహిస్తుండగానే కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు.
బీజేపీ తరుపున అభ్యర్థిగా జయానగర్ నుంచి విజయకుమార్ పోటీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఎన్నికల ప్రచారం సమయంలో ఒక ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.