ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో బిగ్ షాక్ తగలనుంది.తెలుగుదేశం పార్టీని మరో సినియర్నేత వీడనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహారం నచ్చకనే అయన పార్టీ వీడుతున్నట్లు వారు చెబుతున్నారు. అయితే మరో ఏడాదిలో ఎన్నికలుండటం, బీసీల్లో బలమైన నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్య పార్టీని వీడతానని చెప్పడం చంద్రబాబుకి పెద్ద ఎదురు దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాష్ట్ర విభజనకు ముందు ఆర్.కృష్ణయ్యను టీడీపీ పార్టీ నెత్తినపెట్టుకుని చూసుకునేది. ఆయనను గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా తెలంగాణలో ఆ పార్టీ ప్రకటించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని బీసీ ఓటర్లను కూడా ఆకట్టుకునేందుకే ఈ ప్రకటన చేశారన్నది అప్పట్లో చర్చనీయాంశమైంది. కాని గత నాలుగేళ్లుగా కృష్ణయ్య పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమల్లో పాల్గొనడమే మానేశారు.
తాజాగా జరుగుతున్న పరిణామాలు కృష్ణయ్యను వేదనకు గురిచేశాయంటున్నారు తన అనుచరులు . బీసీలపై ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కృష్ణయ్య మండిపడుతున్నారు. దీంతో కృష్ణయ్య పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ విషయం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పి మీరీ పార్టీని వీడాలని కృష్ణయ్య నిర్ణయించుకున్నట్లు తెలిసింది.