ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..ముందు ఒక ఎస్కార్టు ..వెనక ఎస్కార్టు ఉండే విధంగా ఉండగల్గిన ఎమ్మెల్యే ..చుట్టూ భారీ స్థాయిలో అనుచవర్గం కూడా ఉండొచ్చు .కానీ ఇవేమీ ఆయన దగ్గర ఉండవు .పేరుకు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కానీ ప్రజలకు కష్టం వస్తే చాలు తనే ముందుంటాడు .క్షణాల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే సమస్యలను పరిష్కరించి ప్రజలమనిషి అనిపించుకుంటాడు .
ఇంతకూ ఎవరి గురించి అనుకుంటున్నారా ఈ ఉపోద్ఘాతం .ఇంకా ఎవరు ..ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజక వర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ గురించే .ఆయన నియోజకవర్గంలో గత నాలుగు ఏండ్లుగా ప్రభుత్వంప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచుతున్నారు .అయితే ఈ నేపథ్యంలో నిన్న బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి విదితమే .ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయి .
ఈ క్రమంలో భారీ వర్షంతో కూడిన ఈదురు గాలులకు ఖమ్మం హైవేపై పెద్ద వృక్షాలు రోడ్డుపై పడిపోయిఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి ..ఆ సమయంలో అటుగా వెళ్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వయంగా తన కాన్వాయ్ దిగి మరి పెద్ద చెట్లను పక్కకు తప్పించి ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేశారు .ఆయన ఎమ్మెల్యే అందున
అధికార పార్టీ ..వెంటనే ట్రాపిక్ పోలీసులను పిలిపించి ఆ సమస్యను పరిష్కరించవచ్చు .కానీ అలా చేయకుండా తనే స్వయంగా దిగి రోడ్డు మీద పడి ఉన్న చెట్లను తొలగించి ట్రాపిక్ ను క్లియర్ చేయడం స్థానికుల మదిని గెలిచారు ఎమ్మెల్యే ..